బాండ్‌ పేపర్‌ అర్వింద్‌ను నమ్మొద్దు: జీవన్‌ రెడ్డి

ఆర్మూర్‌,సెప్టెంబర్‌22(జనం సాక్షి  ): రైతుబంధు పథకం కింద రూ.73 వేల కోట్లు, రుణమాఫీ కింద రూ.36 వేల కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత సిఎం కెసిర్‌దని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి ,రైతుబంధు కింద కోట్లు అందించినట్లు వివరించారు. ఇంకా అర్హులుంటే పార్టీలకతీతంగా లబ్ధి చేకూరుస్తామన్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఓపెన్‌ జిమ్‌, కమ్యూనిటీ హాళ్లు నిర్మించామని గుర్తుచేశారు. ఎంపీ అర్వింద్‌ గతంలో బాండ్‌పేపర్‌ రాసిచ్చి, అబద్ధపు హావిూతో ఓట్లు దండుకున్నాడని, అలాంటి మాయ మాటలకు ఆగం కావొద్దని సూచించారు. ఎప్పటికైనా తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలువాలని కోరారు.