బాక్సైట్‌ గనుల రద్దును స్వాగతిస్తున్నా : మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌

హైదరాబాద్‌: బాక్సైట్‌ గనుల రద్దు విషయంలో కేంద్రమంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్‌ తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణకు తూర్పుకనుమలు మానవశరీరంలో గుండెకాయలాంటిదని మంత్రి అభిప్రాయాపడ్డరు. ప్రభుత్వం వెంటనే చట్టపరమైన అంశాలను పరిశీలించి బాక్సైట్‌ ఒప్పం దాలన్నింటినీ రద్దు చేయాలని కోరారు. వాన్‌పిక్‌ విషయంలోనూ ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయమే వస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.