బాబర్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన పాక్‌

ఇస్లామాబాద్‌: అణ్వాయుధంతో ఏడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల బాబర్‌ క్రూయిజ్‌ క్షిపణిని పాకిస్థాన్‌ సోమవారం విజయవంతంగా ప్రయోగించి చూసింది. అత్యంత కచ్చితత్వంతో భూమి మీద లక్ష్యాలతో పాటు సముద్రంపైన ఉండే లక్ష్యాలనూ ఛేదించగల సామర్థ్యం దీనికి ఉందని ఒక అధికార ప్రకటనలో పేర్కొన్నారు.