బాబు బతుకు బస్టాండే!
విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు
బాబుకు లేదు : హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 10 (జనంసాక్షి):
తెలంగాణ ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎన్నిస్టంట్లు మార్చినా ప్రజలు నమ్మరని ఇక బాబు బతుకు బస్టాండేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తన పాలనలో కళ్లుడిపోలు మూసివేయించి గీత కార్మికుడు బతుకులు బజారు పాలు చేసిన బాబు ఇప్పడు నిచ్చెనతో ఈత చేట్లు ఎక్కుతూ స్టంట్లు చేస్తున్నారని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.ఒళ్లు జాగ్రత్త అంటున్న మోత్కుపల్లి నరిసింహులు ముందు కింద, మీద పడుతున్న చంద్రబాబు ఆరోగ్యాన్ని జాగ్రత్తగ చూసుకుంటే మంచిదన్నారు. బాబు. మీకోసం వస్తున్న అంటు నడుస్తుంటే టీడీపీల మేము ఉండము బాబు అంటూ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు బయటకు ఉరుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఒకసారి సమైఖ్యనినా దం, మరో సారి రెండు కండ్ల సిద్దాంతం, ఈ మధ్య తెలంగాణకు వ్యతిరేఖం కాందటు పూటకో
మాటమారుస్తున్నా బాబును చూసి ఊసరవేళ్లి కూడా ఆశ్చర్యపోతుందన్నారు. మనిషి అన్నప్పుడు ఒక మాట మీద నిలబడలే.. పార్టీ అన్నప్పుడు ఒక సిద్దాంతం ఉండాలే.. మరి మనిషిగా బాబు.. పార్టీగా టీడీపీ విటీ అర్థలే మార్చివేశారని హరీష్ ధ్వజమెత్తారు.తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించింది చంద్రబాబు అయితే నిషేధించిన తెలంగాణ పదాన్ని పార్లమెంట్‌లో మారుమోగించింది. కేసీఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ ఏమి చేసిందని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు ఇప్పటికైన సిగ్గు తెచ్చుకొని ఆత్మగౌరవంతోటి బతకడం నేర్చుకోవాలని ఆయన సూచించారు. తెలిసో తెలియక టీడీపీతో కలిస్తే 10 మందిమైతే ఇప్పుడు టీడీపీ బురద కడ్కుంటే పదిమందిమి… ఇరవైమందిమైనమన్నారు.




