మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణం

సిరికొండ, ఆగస్టు 20, (జనం సాక్షి ): సిరికొండ మండలం చిన్న వాల్గొట్ గ్రామంలో మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో కొనసాగుతున్న భవన నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణేష్, ఉపసర్పంచ్ గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి శరణ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు విజయ, కారోబార్ సాయిరాం పాల్గొన్నారు. మహిళా సంఘ భవనం పూర్తయితే గ్రామంలోని మహిళలకు సమావేశాలు, సంఘ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. భవన నిర్మాణానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డికి మహిళా సంఘ సభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.



