బాలీవుడ్‌ నటి లైలా ఖాన్‌ హత్య

ముంబయి: గత కొంతకాలంగా అదృశ్యమైన బాలీవుడ్‌ నటి లైలా ఖాన్‌ హత్యకు గురైనట్లు జమ్మూ పోలీసులు తెలియజేశారు. ఈమె గత 11 నెలల నుంచి కనిపంచడంలేదని పోలీసులు వెల్లడించారు. లైలాతోపాటు తన కుటుంబసభ్యుల్ని దుండగులు ముంబయిలో కాల్చి  చంపినట్లు తెలిపారు. లైలాకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.