బాల కార్మికుల చట్టంపై అవగాహన

మల్హర్‌ జూన్‌ 12 (జనంసాక్షి):  మండలంలోని కొయ్యూరులో ఐకేపి కార్యాలయంలో బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం బాల కార్మికుల చట్టంపై మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి బి రామక్రిష్ణ  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళ గ్రూప్‌ సభ్యులందరికి చట్టాలపై అవగాహన ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కోర్టుల చుట్టు తిరిగే ఆర్థిక స్థోమత లేని వారు దరఖాస్తులు చేసుకున్నట్లుయైతే న్యాయవాదిని నియమించి సమస్యలను పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బాల కార్మికులను పని నుండి బడికి పంపించాల్సిన బాధ్యత అందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది భాస్కర్‌, లోక్‌అదాలత్‌ మెంబర్‌ రఘోత్తమరెడ్డి, తహసీల్ధార్‌ కోమల్‌రెడ్డి, ఎస్సై సైదారావు, ఎపీఎం లవ్‌కుమార్‌, మహిళ సంఘాల సభ్యులు పాల్గోన్నారు.