బావిలో పడి మహిళ మృతి
కేసముద్రం: కల్వల గ్రామ శివారు గాంధీపురం తండాలో శుక్రవారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి ఓ గిరిజన మహిళా మృతి చెందింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం…తండాకు చెందిన బాదావత్ రామి(56)తమ వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా అక్కడకు వెళ్లింది. బావిలోకి తొంగిచూస్తుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడిపోయింది. తీవ్ర గాయాలైన ఆమెను వెంటనే బావిలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.