బిఆర్ఎస్ సభకు భారీగా తరలిన జనం

 

– ఖమ్మం లో బిఆర్ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి

బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు

అశ్వారావుపేట జనవరి18 (జనం సాక్షి) :
ఖమ్మం లో జరిగే బి ఆర్ ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భవ సభను విజయవంతం చేయాలని అశ్వారావుపేట బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జుజ్జూరు వెంకన్నబాబు అన్నారు. అశ్వరావుపేట మండలం నుండి తిరుమలకుంట నారాయణపురం వినాయకపురం ఆసుపాక అచ్చుతాపురం నారం వారి గూడెం, తదితర గ్రామాలనుండిఅధిక సంఖ్యలోబి బిఆర్ఎస్ కార్యకర్తలు ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు కార్లు, బస్సులు ద్విచక్ర వాహనా లో తరిలారు. ఈ కార్యక్రమంలో బొల్లుకొండా చెన్నారావు, జుజ్జూరు రాంబాబు, పల్లెల రామ లక్ష్మయ్య, జుజ్జూరు సత్యనారాయణ, డాబా జగ్గారావు, సీతారామయ్య, పానుగంటి లక్ష్మణరావు, జగన్నాథం, చంద్రం, సున్నం రామ లక్ష్మయ్య,తదితర బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.