బిల్లులో ఎలాంటి స్పష్టత లేదు : గాలి ముద్దుకృష్ణమనాయుడు
హైదరాబాద్ : ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక అమలుకు ప్రవేశపెట్టిన బిల్లులో ఎలాంటి కొత్తదనం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నిధులు వైఎస్ హయాంలోనే పక్కదారి పట్టాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టిన రీతిలో బిల్లు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.



