బీఏసీ సమావేశానికి సీఎం, డీప్యూటీ సీఎం గైర్హాజరు

హైదరాబాద్‌: ఈరోజు శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సంఘం సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీలు ప్రబలశక్తిగా ఎదిగి రాష్ట్రాన్ని పాలిస్తారని వ్యాఖ్యానించారు. అనంతపురంలో కార్యక్రమం ఉన్నందునే ముఖ్యమంత్రి బీఏసీ సమావేశానికి హాజరు కాలేదని, ఉపప్రణాళికపై ప్రత్యేక సమావేశం పెట్టడమే ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకట రమణారెడ్డి తెలియజేశారు.