బీజేపీకి అన్ని వర్గాల నుంచి మద్దతు

` మా పార్టీ మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తున్నారు
` కాంగ్రెస్‌ ఫేక్‌ గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదు
` ఆ రెండు పార్టీల నేతలు ప్రజల సంపదను దోచుకున్నారు
` బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో మన మోదీ గ్యారంటీ – బీజేపీ భరోసా పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌?రెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఫేక్‌ గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌, ప్రస్తుతం బీఆర్‌?ఎస్‌ పార్టీల? పాలన అవినీతిమయమైందన్న ఆయన.. ఆ రెండు పార్టీల నేతలు ప్రజల సంపదను దోచుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే అవినీతి లేని పరిపాలన అందిస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రంలో బీజేపీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌?రెడ్డి పేర్కొన్నారు. బీసీలు, ఎస్సీల నుంచి తమ పార్టీకి మద్దతు రావడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారన్న ఆయన.. ఆ పార్టీ ప్రచార వాహనాలను ప్రజలు స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ మేరకు మాట్లాడారు. మన మోదీ గ్యారంటీ – బీజేపీ భరోసా పేరుతో ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఫేక్‌ గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌పార్టీల పాలన అవినీతిమయమైందని.. ఆ రెండు పార్టీల నేతలు ప్రజల సంపదను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీల నుంచి సచివాలయం వరకు అవినీతి లేని పరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. బీసీలు, ఎస్సీల నుంచి మద్దతు రావడం సంతోషంగా ఉంది. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారు. ఆ పార్టీ ప్రచార వాహనాలను స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేనిఫెస్టోను రూపొందించాం. బీజేపీ ప్రభుత్వం వచ్చాక గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు అవినీతి లేని పరిపాలన అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి అవినీతిపై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జితో విచారణ జరిపిస్తామని కిషన్‌?రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌నేతలు ప్రజల సంపదను దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను కేసీఆర్‌ సర్కార్‌ దెబ్బ తీసిందని.. ఆర్థికంగా రాష్ట్రాన్ని కోలుకోలేని స్థితికి తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. 1వ తేదీన జీతాలు ఇవ్వలేని స్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న ఆయన.. బీఆర్‌ఎస్‌కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉంటేనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ అవినీతిపై సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జితో విచారణ జరిపిస్తాం. కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల సంపదను దోచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను భారత్‌? రాష్ట్ర సమితి దెబ్బ తీసింది. ఆర్థికంగా రాష్ట్రాన్ని కోలుకోలేని స్థితికి తీసుకొచ్చింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుంది. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉంటేనే సాధ్యమని అన్నారు. బీజేపీ మేనిఫెస్టో ప్రకటన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు. తమ అంచనాలకు మించి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందని వివరించారు. ప్రజలు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని.. ఒక నిశ్శబ్ధ విప్లవం రాబోతుందని పేర్కొన్నారు. కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. రాహుల్‌?గాంధీకి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రధాని ఆరు సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్న ఆయన.. మోదీ పర్యటన ప్రతిపాదనను సీఎం కార్యాలయానికి పంపించామని స్పష్టం చేశారు.

తాజావార్తలు