బీమా పత్రాలు అందచేసిన మంత్రి జూపల్లి

నాగర్‌ కర్నూల్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతుకు బీమా కల్పించిన ఘనత దేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం చింతలపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి.. రైతులకు బీమా పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం బీమా కాలువ పనులను ఆయన పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌ లో ఉంచాలన్నారు. అనంతరం కొల్లాపూర్‌ పట్టణంలో మండల స్థాయి అథ్లెటిక్‌ పోటీలను ఆయన ప్రారంభించారు.