బెయిలివ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం భావించింది

హైదరాబాద్‌ : జగన్‌కు బెయిల్‌ ఇస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను గమనించే  సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయాణ అన్నారు అఫిడవిట్లు వాదనలు అన్నీ పరిశీలించాక బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం బావించిందని బొత్స అభిప్రాయపడ్డారు జగన్‌ను జైలులో పెట్టాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించిన ఆయన సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించిరు ఎవరికి ఏతరహా ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్‌పై బురదజల్లి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని  ప్రతిపక్షాలనుద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు.