భర్త వేధించడంతో హేర్‌ డై తాగి మహిళా కానిస్టేబుల్‌ మృతి

పెద్దపల్లి, మే24 (జనంసాకి):
పెద్దపల్లి పోలిస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వహిస్తున్న మమత అనే కానిస్టేబుల్‌ గురువారం ఉదయం హేర్‌ డై సేవించి మరణించిందని పట్టణ పోలీసులు తెలిపారు.ఈ మెకు ఆరు నెలల క్రితం వివాహం జరిగిం ది.ప్రేమ వివాహం కావడం చేత అత్త,మామా, భర్త అదనపుకట్నం కోసం వేదించడంతో మనస్థాపనకు గురై హేర్‌ డై సేవించడంతో చికత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కరీంనగర్‌ తరలించా రు. మద్యాహ్నం చికిత్స పొందుతూ మరణించిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.