భాజపా గెలుపుకు రేవంత్ కృషి
` ఇండియా,ఎన్డీఎ కూటములకు షాక్
` ఇక ప్రాంతీయ పార్టీలదే హవా
` బీఆర్‌ఎస్, వైకాపాలు కీలక భూమిక పోషిస్తాయి
` కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు తిరస్కరించారు
` బీఆర్‌ఎస్ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు
` కేసీఆర్ బస్సుయాత్రతో అనుకూలంగా పరిస్థితులు
` మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్
రాజన్న సిరిసిల్ల(జనంసాక్షి): పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు.. బీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, బీజూ జనతాదళ్ లాంటి ప్రాంతీయ శక్తులే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయన్నారు. ఇకపోతే ఐదు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్‌గా నడిపింది. ప్రజల సమస్యల పట్ల అవగాహన లేకుండా.. అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకుని మేడిగడ్డ, శ్వేతపత్రాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై ఫోకస్ చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నించిందని కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ సైనికులు అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించారు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించబోతున్నాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్ అత్యధిక స్థానాల్లో గెలవబోతుంది. ఈనాడైనా ఏనాడైనా బీఆర్‌ఎస్ పార్టీనే తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని ప్రజలకు అర్థమైంది. ఆ రెండు పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్‌ను దూషించడానికి పరిమితం అయ్యాయన్నారు. తెలంగాణకు ఏం చేయకపోయినా అడ్డగోలు విమర్శలు చేశాయి. వీరి వల్ల ఏం కాదని ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఎన్నికల్లో చేసిన కృషి స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది కాబోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అయితే పరిస్థితి బాగుండదు. ఈ ఐదు నెలల్లోనే ఎక్కడ లేని వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఐదు నెలల్లోనే అసాధారణ వ్యతిరేకత వచ్చిందన్నారు. అడ్డగోలు హావిూలిచ్చి నెరవేర్చలేదనే కోపంతో ప్రజలు ఉన్నట్లు పలువురు నాయకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ బుద్ది తెచ్చుకొని 420 హావిూలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు అని కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఢల్లీిలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు ఈ రెండు పార్టీల వైఖరి ఉందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. కొత్త జిల్లాలను రద్దు చేయాలని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కారు. రైతుభరోసా అని చెప్పి మోసం చేశారు. రుణమాఫీ విషయంలో తేదీలు మార్చుతూ సీఎం ఒట్లకు పరిమితమయ్యారు. రైతాంగమంతా కేసీఆర్ ఉన్నప్పుడే వ్యవసాయం బాగుండే అంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు కర్రుకాల్చి వాత పెట్టినట్టు అర్థమైంది. ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలో కనబడుతుంది. ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడిరది. కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలకు 100 రోజుల్లో 2500 ఇస్తామన్నారు. తులం బంగారం, స్కూటీ అన్నారు.. ఈ హావిూలు నెరవేరలేదు. మంచినీళ్ల కోసం బిందెలు పట్టుకుని రోª`డడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిరది. దీంతో మహిళలు ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితి లేదు. 4 వేల పెన్షన్ ఇవ్వలేదు. ఈ ఐదు నెలల కాలంలో కాంగ్రెస్‌కు తోడైంది ఏం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ పట్ల కూడా తెలంగాణ ప్రజలకు సానుకూలత లేదు. తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలను గెలిపించినా ఏం అభివృద్ధి జరగలేదు. పెట్రోల్, డిజీల్, నిత్యావసర వస్తువుల ధరలు పిరం అయిన తర్వాత మోదీ విూద వ్యతిరేకత కనబడుతుంది. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను అర్థం చేసుకుని 17 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాం. 50 శాతం సీట్లను బీసీలకు కేటాయించి సామాజిక సమతూకాన్ని పాటించి, బలహీన వర్గాలకు బీఆర్‌ఎస్ పార్టీ న్యాయం చేసిందని కేటీఆర్ తెలిపారు. బలమైన సీనియర్ నాయకులను పోటీలో పెట్టాం. కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాచూట్ లీడర్లకు సీట్లు కేటాయించింది. బీజేపీ అభ్యర్థులు ఆరేడుగురు, కాంగ్రెస్‌లో నలుగురు అభ్యర్థులు మా పార్టీ నుంచి పోయిన వారే ఉన్నారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల పట్ల విముఖత కనబడిరది. మా అభ్యర్థుల పట్ల ప్రజల్లో సానుకూలత కనబడిరది. ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెటలు పట్టించే పరిస్థితి గులాబీ దండు తీసుకొచ్చింది. ఢల్లీిలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. ఆరేడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన నాయకులను పెట్టింది. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి ఇలా ఆరేడు సీట్లలో డవ్మిూ అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించాడు. కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ గులాబీ సైనికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా గులాబీ సైన్యంలో గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనబడుతోంది కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో పరాభవం పాలైనప్పటికీ, రకరకాల కుట్రలు, కుతంత్రాలతో పార్టీలో నుంచి నాయకులు తీసుకోని పోయినప్పటికీ, గ్రామగ్రామనా, ప్రతి పట్టణంలో మొక్కవోని దీక్షతో గులాబీ సైనికులు పని చేశారు. ఒక వైపు క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తలు బలంగా పని చేశారు. మరోవైపు సోషల్ విూడియాలో ప్రత్యర్థుల దుష్పచ్రారాలు, విమర్శలను తిప్పికొడుతూ అద్భుతంగా పని చేసిన సోషల్ విూడియా వారియర్స్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా చురుకుగా పని చేసి బీఆర్‌ఎస్ పార్టీ గెలవాల్సిన అవశ్యకతను వివరించారు అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేపట్టిన కేసీఆర్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పింది. 17 రోజుల బస్సు యాత్రతో జాతీయ పార్టీల నాయకత్వాలు దిగివచ్చాయి. ఏ జిల్లాకు పోయినా, నియోజకవర్గం, పట్టణం పోయినా కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా గులాబీ సైన్యంలో గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనబడుతోంది. గులాబీ సైనికులు రెండు జాతీయ పార్టీలకు ముచ్చెటమలు పట్టించారు. కేసీఆర్ పోరు బాటకు జనం నుంచి వచ్చిన స్పందనతో కార్యకర్తల్లో ఉత్సాహం జోష్ వచ్చింది అని కేటీఆర్ తెలిపారు.