భాజపా పదాధికారుల సమావేశం

హైదరాబాద్‌:భాజపా కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. రేపు నెక్లెస్‌రోడ్‌లో జరిగే తెలంగాణ కవాతు నిర్వహణపై ఈ భేటీలో నేతలు చర్చిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీనియర్‌ నేత దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.