భారత్‌, న్యూజిలాండ్‌ ట్రోఫీని

ఆవిష్కరించిన ధోని, రాస్‌టేలర్‌
హైదరాబాద్‌:భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 23 నుంచి జరగనున్న ఎయిర్‌టెల్‌ టెస్ట్‌ క్రికెట్‌ సిరీస్‌ ట్రోఫీని ఇరుజట్ల కెప్టెన్లు మహెంద్రసింగ్‌ ధోని, రాస్‌ టేలర్‌ ఆవిష్కరించారు. హైదరాబాద్‌ తాజ్‌ కృష్ణాలో ఎయిర్‌టెల్‌ ఏపీ సీఈవో చార్లిస్‌ తాయిల్‌ ఆధ్వర్యంలో ఈ ట్రోఫీ ఆవిష్కరణ జరిగింది. వెండి, బంగారపు పూతతో ట్రోఫీని రూపొందించినట్లు తాయిల్‌ తెలిపారు. స్నేహ పూర్వక వాతావరణంలో మ్యాచ్‌లు జరగాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.