భార్యపై కత్తితో దాడిచేసిన భర్త

కుత్బుల్లాపూర్‌ : వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త తన భార్యపై కత్తితో దాడిచేసి చంపడానికి ప్రయత్నించాడు.మధ్యప్రదేశ్‌కు చెందిన వినోద్‌సింగ్‌(25), సోనాబాయి (22) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ నగరానికి వచ్చారు. జీడీమెట్లలోని అమోద్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. వినోద్‌సింగ్‌ మార్బుల్స్‌ బిజినెస్‌ చేస్తున్నాడు.అతను మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకోని భార్య అడ్డు తోలగించుకోవడానికి బుధవారం ఉదయం సోనాబాయిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన అమెను అసుపత్రికి తరలించారు. అనంతరం అమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.