భాష్పావాయు పేళుళ్లతో దద్ధరిల్లిన ఓయూ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి):
సాగర హారం పేరిట తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన సమయానికి ముందే ఉద్యమకారులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీలుగా బయలుదేరడంతో హైదరాబాద్‌లో హై టెన్షన్‌ మొదలైంది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించతలపెట్టిన సాగర హారానికి అనుమతి ఇచ్చినట్టు ప్రకటించిన ప్రభుత్వం ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడ అరెస్టులు ప్రారంభించింది. నెక్లెస్‌ రోడ్డుకు రాకుండా ఉస్మానియా విశ్వ విద్యాలయంలో విద్యార్థుల ర్యాలీని పోలీసులు ఎన్‌సీసీ గేట్‌ వద్దే అడ్డుకున్నారు. విద్యార్థులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. రబ్బరు బుల్లెట్లను ఉపయోగిం చారు. ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో మార్చ్‌కు అనుమతిచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. మూసివేసిన గేట్లను తోసుకుంటూ విద్యార్థులు ముందకు వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు బాాష్ప వాయువు
గోళాలతో యూనివర్సిటీ ప్రాంగణాన్ని దద్దరిల్లించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులపైకి విద్యార్థులు రాళ్లు రువ్వడంతో వారు టియ్యర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఒక దశలో విద్యార్థులు పెద్ద ఎత్తున ముందుకు చొచ్చుకుపోయి గేట్లను తెరుచుకుని అక్కడ ఉన్న బారికేడ్లను పీకేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి విద్యార్థులను చెదరగొట్టారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవనాన్ని సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులు అతన్ని రక్షించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌ నుంచి ప్రదర్శనగా బయలుదేరాలని ముందే నిర్ణయించారు. దీంతో ఆ ర్యాలీని అడ్డుకునేందుకు సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. సికింద్రాబాద్‌ లోని అమర వీరుల