భూసేకరణ చట్టం సవరణలు ఆమోదించం:సోనియా
ఢిల్లీ : భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేయబోతున్న సవరణలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించదని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. భూసేకరణ బిల్లు అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సోనియా గాంధీ లేఖ రాశారు. భూసేకరణ బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు నష్టపోతారని ఆమె శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.