భోపాల్‌లో కూలిన ట్యాంకు :ఏడుగురి మృతి
భోపాల్ : నగరంలో సోమవారం తెల్లవారుజామున సుమారు ఒంటిగంటకు సాయిబాబునగర్ మురికివాడలో ఓ వాటర్‌ట్యాంకు కుప్పకూలింది. ఈ సంఘటనలో ఏడుగురు మరణించగా మరో 35 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున సాయిబాబానగర్ వద్ద భోపాల్ పురపాలక సంస్థ (బీఎంసీ) ఏర్పాటు చేసిన ఓవర్ హెడ్‌వాటర్ ట్యాంకు కుప్పకూలిందని భోపాల్ కలెక్టర్ నికుంజ్‌శ్రీవాస్తవ తెలిపారు. ఏడుగురు వ్యక్తులు మరణించగా పెద్దసంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారని శ్రీవాస్తవ చెప్పారు. అతిపెద్ద వాటర్‌ట్యాంకు దగ్గర్లో ఉన్న మురికివాడలు విధ్వంసానికి గురయ్యాయని కలెక్టర్ వివరించారు. వాటర్‌ట్యాంకు ఆకస్మికంగా కూలిపోవడం వెనుక కారణాలు తెలియరాలేదు. మృతుల కుటుంబాలకు చెరి రూ. లక్ష రూపాయల పరిహారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్య చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి చెరి రూ. 25 వేల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి చెరి రూ. 10 వేల నగదు సాయాన్ని అందించారు. తీవ్రంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి చెరి రూ.50 వేలు, స్వల్పంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 25వేలు అందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తునా



