మండల కేంద్రంలో 2వ రోజు రిలే నిరహార దీక్ష.

సంఘీభావం తెలిపిన జె ఏ సీ వ్యవస్థాపకులు కోదండరాం….

– మద్దతుగా 01వ వార్డు మెంబర్ కనసాని పావని, వార్డు సభ్యులు….

బూర్గంపహాడ్ ఆగష్టు20 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 2వ రోజు కి చేరిన రిలే నిరహార దీక్ష. బూర్గంపహడ్ మండలాన్ని పోలవరం ముంపు మండలంగా ప్రకటించి మెరుగైన ప్యాకేజ్ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సమగ్ర పరిహారం ఇవ్వాలని కోరుతూ దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్ష కు మద్దతుగా ఉదయం నుండి సాయంత్రం వరకు శిబిరంలో స్థానిక గ్రామ నివాసి మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం సతీమణి కుంజా వెంకటరమణ, మొదటి వార్డు మెంబర్ కనసానీ పావని, మహిసాక్షి రామ సీత, 1వ వార్డు మహిళలు పెద్ద ఎత్తున దీక్షలో కూర్చుని నిరసన తెలియజేశారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాం ఫోన్ లైన్ లో దీక్షలో కూర్చున్న సభ్యులందరితో మాట్లాడి సంఘీభావం తెలిపారు. భవిష్యత్తులో చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ దీక్షా కార్యక్రమానికి మద్దతుగా మండల కాంగ్రెస్ నాయకులు పూలపల్లి సుధాకర్ రెడ్డి పోతురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మహ్మద్ ఖాన్, యల్లంకి రాము, చల్లా వెంకట నారాయణ, యం డి యాకూబ్ పాషా, గ్రామ ఆదర్శ రైతు భజన నాగం పాల్గోన్నారు. మద్దతుగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సిపిఐ పట్టణ కార్యదర్శి ముదిగొండ బాలకృష్ణ, గోల్కొండ ప్రభాకర్ పాల్గొన్నారు. శనివారం దీక్షకు గ్రామస్థులు డాక్టర్ లక్కోజు విష్ణు వర్ధన్, పత్రికావిలేఖరి కందుకూరి శ్రీనివాసచారి సాయంత్రం 04గంటలకు దీక్ష సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. జె ఏ సి కన్వినర్ కేవీ రమణ, ప్రధాన కార్యదర్శి దామర శ్రీనివాస రావు, రాజేష్ రెడ్డి, బోలుకొండ ప్రభాకర్, సర్పరాజ్ ఆలీ, తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల కరుణాకర్ రెడ్డి, సురకంటి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.