మండల స్థాయి ఉమ్మడి బ్యాంకర్ల భేటీ

– రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి
రంగారెడ్డి, జూన్‌ 27 : జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల ద్వారా రుణాలు అందించేందుకు వీలుగా మండల స్థాయి ఉమ్మడి బ్యాంకర్ల సమావేశాలను జులై 11 వరకు నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి తెలిపారు. ఈ సమావేశాలకు జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు హాజర్వాలని, అదే విధంగా వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొంటున్నందున సకాలంలో లబ్ధిదారులకు రుణాలు అందేలా చూడాలని ఆయన సూచించారు. గురువారం తాండూర్‌, జులై2 మర్పల్లిలో, 3న రాజేంద్రనగర్‌లో, 4న మహేశ్వరంలో, 5న వికారాబాద్‌లో, 6న చేవెళ్లలో, 9న మేడ్చల్‌, 10న పరిగిలో, 11న హయత్‌నగర్‌లో సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశాలు స్థానిక యంపిడివో కార్యాలయాల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.