మంత్రి బాలరాజుకు గల్లాకు మధ్య మాటల వివాదం

విశాఖపట్నం: రోబోశాండ్‌ వర్క్‌షాపులో విశాఖలో కృత్రిమ ఇసుక తయారీపై జరుగుతున్న సమావేశంలో ఇసుక మాఫియా ఆగడాలపై మంత్రి బాలరాజు గనులశాఖ మంత్రి గల్లా అరుణకు ఫిర్యాదు చేశారు. ఇసుక తవ్వకాలపై గనులశాఖ సరైన చర్యలు తీసుకోవటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులుగా ఉన్న మీరుకేడా చర్యలు తీసుకోవచ్చని మంత్రి గల్లా అనటంతో ఆమో వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన మంత్రి బాలరాజు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.