మంథనిలో మళ్లీ మొదలైన దొంగల బెడద..! – బెంబెలెత్తిపోతున్న పట్టణ ప్రజలు ప్రజలు

share on facebook

 

జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలో గత కొంతకాలంగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకున్న దొంగలు యదేచ్చగా వారి పని వారు సాఫీగా చేసుకుపోతున్నారు. పట్టణంలోని వాగుగడ్డ ప్రాంతంలో తాళం ఉన్న ఇంటిలో మళ్లీ దొంగతనానికి పాల్పడ్డారు. ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న రాజు మేడారం పోయి ఆదివారం ఇంటికి చేరుకోవడంతో తాళం పగలగొట్టి లూటీ చేశారు. ఇంట్లో ఏడు తులాల బంగారం తో పాటు విలువైన వస్తువులు దోచుకు వెళ్లారని బాధితుడు బోరంగా విలంబించాడు. గత సంవత్సరం ఫిబ్రవరి 16న ఒకేరోజు ఐదు ఇండ్లలో దొంగతనాలు జరిగిన విషయం అప్పట్లో సంచలనం అయింది. ఇప్పటివరకు వారి ఆచూకీ పోలీసులు కనుగొనకపోవడంతో అప్పటినుండి ఇప్పటివరకు అడపా తడప దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరి 16న తమ్మి చెరువు కట్ట వీధిలో గల రిటైర్డ్ ఎంపీడీవో ఇంటిలో దొంగలు పడి నగలు ఇతరత్రా సామాగ్రిని దోచుకుపోయారు. పట్టణంలోని కొన్ని సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగల బాగోతం పూర్తిగా బట్టబయలైంది అయినప్పటికీ వారి ఆచూకీ ఇప్పటికీ తెలుపక తెలుసుకోకపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రజల్లో నెలకొన్న అభద్రతాభావం తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో అడపా తడప తాళాలు ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకున్న దొంగల ఆచూకీ పై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పోలీసుల పైనే ఉంది.

Other News

Comments are closed.