మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి
సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు.
జిల్లాలో మండలానికి 100 మట్టి గణపతి విగ్రహాల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ, అధికారులు పాల్గొన్నారు