మత్స్యకారులు ఐక్యతగా పోరాడాలి

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి
బిజినేపల్లి. సెప్టెంబర్.17. జనం సాక్షి. మండలంలోని మత్స్యకారులు అందరూ ఐక్యతగా పోరాడితేనే ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతామని మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మండల అధ్యక్షులు అల్లోజి పిలుపునిచ్చారు శనివారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల మత్స్యకార సంఘం సభ్యులకు సమావేశం మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మచ్చ కారులు అధికంగా ఉన్న ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నామని సంఘాలు బలోపేతంగా తయారు చేసుకోవాలని అందరూ కలిసికట్టుగా ఉంటూ సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు గ్రామాలలో మత్స్యకారులకు ఏదైనా సమస్య వస్తే మండల కమిటీ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు చెరువుల పైన వేరే కులస్తులు దాడులు జరిపినప్పుడు అందరూ కలిసి పోరాటం చేయాలని అన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన పాలెం గుడ్ల నర్వ గ్రామాల కమిటీ సభ్యులకు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మస్కూరి బంగారయ్య మండల ఉపాధ్యక్షులు సొప్పరి బాలస్వామి బోలా కృష్ణయ్య ఉమ్మడి జిల్లా డైరెక్టర్ గుండయ్య మిద్దె యాదయ్య తిరుపతయ్య కాశన్న వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు]
Attachments area


