మత్స్యకార రైతులను క్షేత్రస్థాయి సందర్శన మరియు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు ఖమ్మం జిల్లా పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రం నకు తీసుకుని వెళ్లడం జరిగింది
మామునూర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద నేడు షెడ్యూల్ కులాల మత్స్యకార రైతులను క్షేత్రస్థాయి సందర్శన మరియు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు ఖమ్మం జిల్లా పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రం నకు తీసుకుని వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ ఎం రాజన్న గారు మాట్లాడుతూ క్షేత్రస్థాయి సందర్శన రైతులకు మంచి పరిజ్ఞానాన్ని మరియు అనుభవాన్ని ఇస్తుందని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో చేపల పెంపకానికి అనువైన చేపల జాతులను పెంపకపు విధానాలను చేప పిల్లల ఉత్పత్తికి సంబంధించిన విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు అలాగే చెరువులలో చేపలు పట్టు విధానం చేపల ప్రత్యుత్పత్తి బంగారు తీగల చేపల ప్రత్యుత్పత్తి విధానం రంగు చేపల యొక్క యాజమాన్య పద్ధతులు రైతులు వారి చేతుల మీదుగా నిర్వహించారు తదుపరి పాలేరు రిజర్వాయర్ లోని కేజీ కల్చర్‌ను సందర్శించి కేజీ కల్చర్ లో చేపల విభాగం చేపల పెంపకంపై అనుభవాన్ని పట్టును సాధించారు మరియు పెన్ కల్చర్ పై అనుభవాన్ని కూడా పొందారు అలాగే పాలేరు దగ్గరలో ఉన్న మచ్చ రైతుల యొక్క చెరువులను సందర్శించి చేపల పెంపకానికి కావలసిన అనుభవాన్ని తెలుసుకున్నారు అలాగే ప్రయోగాత్మకంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో పాలేరు మత్స్యశాఖ మత్స్య కేంద్ర విభాగాధిపతి మరియు శాస్త్రవేత్తలు పాల్గొని పాలేరులో జరుగుతున్నటువంటి వివిధ రకాల పరిశోధనలను మరియు పాలేరులో జరుగుతున్నటువంటి వివిధ పెంపకపు విధానాలను రైతులకు క్షుణ్ణంగా వివరించారు ఈ సందర్భంగా రైతులు నేటి అనుభవం నేటి అనుభవంలోని విషయాలను పరిగణలోని తీసుకొని ఈ అనుభవానికి హర్షం వ్యక్తం చేశారు