మద్యం విధానంపై రేపు, ఎల్లుండి ఆందోళనలు: తేదేపా

హైదరాబాద్‌: నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహహించనున్నట్లు తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి చెప్పారు. ఈనెల 25న అన్ని కలెక్టరేట్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాలివ్వనున్నట్లు ఆమె తెలిపారు. 26న మద్యం లైసెన్స్‌ల కోసం లాటరీలు నిర్వహించే కేంద్రాల వద్ద తెలుగు మహిళలు నిరసన తెలియజేసి అడ్డుకుంటారని అన్నారు. మద్య నియంత్రణ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కిందని విమర్శించారు.