మద్యం షాపును ఎత్తివేయాలంటూ ఆందోళన

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణం మూసివేయాలని కొత్తపేటలోని మారుతీనగర్‌లో ఆందోళన నిర్వహించారు. స్థానిక సుధీర్‌ అపార్ట్‌మెంట్‌ సమీపంలో కొత్త మద్యం షాపు ఏర్పాటు చేయడంతో దాన్ని మూసివేయాలని అపార్ట్‌మెంట్‌ వాసులు, స్థానిక మహిళలు, నాయకులు ఆందోళనకు దిగారు.