మధ్యాహ్న భోజనం నిధులు విడుదల.

 

డీఈవో గోవిందరాజులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 2(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంకు సంబం ధించిన మార్చి నుండి జులై వరకు చెల్లించాల్సిన బిల్లుల 3 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల అయ్యాయని డీఈఓ గోవిందరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా విద్యాశాఖనుంచి నిధుల విడుదల చేసినట్టు డీఈవో తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.3 కోట్లు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.
అలాగే భోజన కార్మికుల వేతనాలు విడుదలయ్యాయని, రెండు మూడు రోజుల్లో కార్మికుల ఖాతాకు జమ కానున్నట్లు ఆయన తెలిపారు.