మరదలిని చంపి ఆత్మహత్య చేసుకున్న బావ

నిజామాబాద్‌: డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే లత (30) అనే మహిళను ఆమె బావ సంగెం గంగాధర్‌ గొంతు నలిమి హత్య చేశాడు. అనంతరం ఘటనస్థలిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తమ్ముని భార్య అయిన లతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానించిన గంగాధర్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.