మరో ముగ్గురు అమర్‌నాథ్ యాత్రికుల మృతి
శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్రలో మరో ముగ్గురు యాత్రికులు మరణించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుడొకరున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన అమర్‌నాథ్ యాత్రికుల సంఖ్య 88కి చేరుకుందన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన నవీన్ కుషా(42), ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన ఎ.ఎన్.ఎన్. మోల్లీ గుండెపోటుతో మరణించారు. బాల్టాల్ ప్రాంతంలోని ఒక యాత్రికుల గుడారంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండగా కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. అతడి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గురువారం సాయంత్రం దాకా 5, 40, 044మంది యాత్రికులు అమరనాథుడిని దర్శించుకున్నట్లు వారు తెలిపారు.