మహానంది ధ్వజస్తంభం తొలగింపు

మహానంది: కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో నాలుగేళ్ల క్రితం ఖిన్నమైన మహాధ్వజ స్తంభాన్ని ఆదివారం తోలగించారు. దీని స్థానంలో 62 అడుగుల ఎత్తు ఉన్న మహాధ్వజ స్తంభాన్ని డిసెంబర్‌ 8న ప్రతిష్ఠించనున్నట్లు  దేవస్థానం ఉప కమిషనర్‌ దివాకర్‌బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ, ధర్మాదయ శాఖ సలహాదారు వేలు, జిల్లా ఉప కమిషనర్‌ వెంకటేశ్వర్లు పాల్గోన్నారు.