మహానందీశ్వరునికి తితిదే పట్టువస్త్రాలు

మహానంది: కార్తీక  పౌర్ణమి, మనగుడి కార్యక్రమాల్లో భాగంగా తిరమల తిరుపతి దేవస్థానం మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీకామేశ్వరిదేవి సహిత మహా నందీశ్వర స్వామివార్లకు పట్టువస్త్రాలను సమర్పించింది. తితిదే జేఈవో శ్రీనివాసరాజు దంపతులు పట్టువస్త్రాలను తీసుకువచ్చారు. తితిదే వేదపండితులు, ఆలయ అర్చకులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు.