మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ రాజీనామా ఆమోదం

ముంబయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ రాజీనామను రాష్ట్ర గవర్నర్‌ కె.శంకరనారాయణన్‌ శనివారం ఆమోదించారు. ముఖ్యమంత్రి సూచనమేరకు అజిత్‌ నిర్వహించిన ఆర్థిక, ప్రణాళిక మంత్రిత్వ శాఖలను గ్రామీణాభివృద్ధి మంత్రి జయంత్‌ పటేల్‌కు ఇంధన శాఖను ఉన్నత, సాంకేతిక విద్యాశాక మంత్రి రాజేష్‌ తోపేలకు కేటాయించేందుకు గవర్నర్‌ అంగీకరించారు. శనివరాం గంటకు పైగా గవర్నర్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ రాజీనామా లేకను ఆయనకు స్వయంగా అందించారు. అనంతరం పృధ్విరాజ్‌ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఇక ఉప ముఖ్యమంత్రి పదవి ఉందబోదని స్పష్టం చేశారు.