మహిళలు షీ టీంకు పిర్యాదు చేసిన సంబందిత

మహిళలు షీ టీంకు పిర్యాదు చేసిన సంబందిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము
-జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్.
గద్వాల నడిగడ్డ, నవంబర్ 30 (జనం సాక్షి);
జిల్లాలో మహిళను వేధించిన వారి ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, షి టీం పనితీరు పై జిల్లా ఎస్పీ పోలీస్ కార్యాలయంలో బుధవారము మీడియా సమావేశం నిర్వహించారు .
జోగుళాంబ గద్వాల జిల్లాలో రద్దీగా ఉన్న ప్రదేశాలలో, స్కూల్స్, కాలేజీలు,పబ్లిక్ ప్రదేశాలలో 90 హాట్స్పాట్సను జోగుళాంబ గద్వాల షీ టీమ్స్ గుర్తించడం జరిగిందనీ, ఇప్పటివరకు స్కూల్స్, కాలేజీలు,పబ్లిక్ ప్రదేశాలు, జాతరలు,సంతలు మొదలైన ప్రదేశాలలో ఇప్పటి వరకు షీ టీం బృందాలు 644 సార్లు సందర్శించడం జరిగిందనీ, షీ టీం బృందాలు హాట్స్పాట్సను సందర్శించే సమయాలలో మహిళలను వేధిస్తూ పట్టు పడిన 30 మంది ఆకతాయి లపై రెడ్ హ్యాండెడ్ కేసెస్ నమోదు చేయడం జరిగిందనీ, జిల్లాలో అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురి చేస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ షీ టీం బృందాలచే పట్టుబడిన సుమారు 42 మందికి గద్వాల డీఎస్పీ ఆధ్వర్యంలో వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందనీ,మహిళల పట్ల, విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, వేధింపులకు గురిచేసిన 8 మంది పై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని చట్ట ప్రకారం రిమాండ్ పంపడం జరిగిందనీ,షీ టీం బృందాలు, మహిళలను వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా సైగలు చేసిన వేధింపులకు గురైన మహిళలు ఇచ్చిన ఫిర్యాదు లపై 11 మందిపై ఇ పెట్టి కేసులు నమోదు చేయడం జరిగిందనీ,మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులకు సంబంధించి మహిళలు మౌనం విడి నిర్భయంగా సుమారు 78 మంది ముందుకు వచ్చి పోలీస్ షీ టీం బృందాలకు పిర్యాదులు చేయడం జరిగినదనీ,జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు కళాశాలలో, పాఠశాలల్లో, తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూల్ లలో, కేజీబీవీ స్కూళ్లలో, విద్యార్థిని విద్యార్థులకు, పబ్లిక్ ప్రదేశాలలో ప్రజలకు ర్యాగింగ్,ఈవ్ టీజింగ్, పోక్సో,షీ టీమ్స్,యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సోషల్ మీడియాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందనీ, ఇప్పటి వరకు 26 పాఠశాలల్లో, 29 కళాశాలలో, 42 పబ్లిక్ ప్రదేశాలలో మొత్తం 97 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందనీ,
సమాజంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులకు సంబంధించి మహిళలు మౌనం విడి నిర్భయంగా ముందుకు వచ్చి పోలీస్ షీ టీం బృందాలకు పిర్యాదు చేయాలని, తద్వారా షీ టీం సేవలను వినియోగించుకొని వేధింపుల నుండి, దాడుల నుండి బయటపడాలని జిల్లా ఎస్పీ కోరారు. జిల్లాలో షీ టీం బృందాలు మహిళల బాలబాలికలు, విద్యార్థినిలకు విద్యార్థులకు రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుందని, ఏదైనా ఫోన్ వస్తే వెంటనే సంఘటన స్థలానికి షీ టీం బృందం చేరుకుని గుర్తించిన హాట్స్పాట్ వద్ద మరింత నిఘా ఉంచడం జరుగుతుంది. హాట్స్పాట్స్ ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ప్రత్యేక గుర్తింపు పొందిందని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లాలో మహిళలు బాలికలు విద్యార్థినిలు షీటీమ్స్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. షి టీం ద్వారా నమోదు అయ్యే కేసులలో ఎవరూ కుడా బాధితులు కాంప్రమైజ్ కావొద్దని, నిందితులకు తప్పకుండా శిక్ష పడేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఎవరైనా మహిళలను వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా సైగలు చేసిన, వెంబడించిన వెంటనే 100 లేదా షీటీమ్ వాట్సప్ నెంబర్ 7993131391, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9494921100 లకు ఫోన్ చేసినచో మరియు కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు.ఫిర్యాదు అందిన వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంటాం అని ఫోన్ చేసిన వారి నెంబరు పేర్లు గోప్యంగా ఉంచుతామని, మహిళలు మరియు బాలికల రక్షణ గురించి షీటీమ్స్ పని చేయడం జరుగుతుందని, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వాట్సప్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని మీకు తెలియకుండా పోలీసులు సివిల్ డ్రస్ లలో ముఖ్య కూడలిల్లో తిరుగుతున్నారని అలాగే చదువుకునే విద్యార్థినిలకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహము చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 1098 కు తెలియజేయాలని యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ యూనిట్ కూడా జోగుళాoబ గద్వాల జిల్లాలో ఏర్పాటు చేశామని ఆ యూనిట్ కుడా నిరంతరం పాఠశాలలు, కళాశాలలు మరియు గ్రామాల్లో తిరుగుతూ మానవ అక్రమ రవాణా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని జిల్లా ఎస్పీ తెలిపారు. మనుషుల అక్రమ రవాణా జరిగితే వెంటనే సమాచారం అందించాలని తరచుగా కిడ్నాప్ తదితర ఆర్గనైజ్డ్ నేరాలు చేసే వారిపై ఫిర్యాదు చేయాలని …