మహిళా దినోత్సవ ఆటలు పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానం
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి పట్టణంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయం లో యాక్షన్ – ఎయిడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన వారందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శిశుగృహ, బాలసదన్, సఖీ శాఖల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారి సైదులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నాదని అన్నారు. యాక్షన్ – ఎయిడ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హెచ్ ఆర్ డి మాధవి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అన్ని రంగాల్లో మహిళలు గొప్ప స్థానానికి వెళ్తారని అన్నారు. మహిళలు తన కాళ్ళపై తను నిలబడేలా యాక్షన్ – ఎయిడ్ సంస్థ పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో శిషుగృహ, బాలసదన్ అయ శాఖల తదితరులు పాల్గొన్నారు.