మాజీ మంత్రి అమిత్‌ షాకు బెయిల్‌ రద్దు కుదరదు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సొహ్రాబుద్దీన్‌ షేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న గుజరాత్‌ మాజీ మంత్రి అమిత్‌ షాకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ మేకు సీబీఐ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే, విచారణ నిస్పక్షపాతంగా కొననాగేందుకు ఈ కేసును గుజరాత్‌ నుంచి ముంబయికి మార్చాలన్న దర్యాప్తు సంస్థ వినతికి సానుకూలంగా స్పందించింది. ఈ కేసులో అమిత్‌ను సీబీఐ 2010 జులై 25న అరెస్టు చేసి సబర్మతి జైలులో ఉంచింది. ఆ తర్వాత గుజరాత్‌ హైకోర్టు అమిత్‌కు బెయిల్‌ ఇవ్వగా సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.