మానవులందరూ కలిసి ఉండాలి… చెత్తను వేరు చేయాలి…
శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 3
మానవులందరూ కలిసి ఉండి ,చెత్తను వేరు చేసి, గ్రామాలను పచ్చదనం పారిశుద్ధ్యంతో నింపాలని యూనిసెఫ్ రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ వెంకట్ అన్నారు. శనివారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో స్వచ్ఛత బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పచ్చదనంపై,, క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ సర్పంచ్ కొండ్ర రాజయ్య స్వచ్ఛత అధికారులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ రమేష్ మాట్లాడారు. కాలుష్య నివారణ కోసం ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజలంతా కలిసి ఉండి చెత్తను వేరుచేసి ప్రభుత్వం ఏర్పాటు చసిన డంపింగ్ యార్డ్ లో నిల్వ చేసి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేసుకొని ఆరుబయట మల విసర్జన నిషేధించి, కాలుష్య నివారణకు తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండ్ర రాజయ్య, స్వచ్ఛభారత్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి, జిల్లా కోఆర్డినేటర్ రమేష్, మహిళా సంఘ ప్రతినిధులు మహిళా సంఘ సభ్యులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.