మార్గరెట్‌ అల్వాకు మెర్సీ రవి అవార్డు

కోచి: సామాజిక, రాజకీయ రంగాల్లో విశేష సేవలందించే మహిళలకు ఇచ్చే మెర్సీ రవి అవార్డుకకు ఈ ఏడాది రాజస్థాన్‌ గవర్నర్‌ మార్గరెట్‌ అల్వా ఎన్నికయ్యారు. బుధవారం కోచిలో జరిగే ఒక కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి వూమెస్‌ చాందీ ఈ అవార్డును ఆమెకు బహుకరించనున్నారని అవార్డు ఫౌండేషన్‌ చైర్మన్‌ పీవీ చంద్రస్‌ తెలియజేశారు.జ అవార్డు కింద లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తారు. కేంద్రమంత్రి వాయలార్‌ రవి భార్య మెర్సీ రవి పేరుమీద ఈ అవార్డును ఏర్పాటు చేశారు.