మార్చ్‌లో పాల్గొంటా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ: తెలంగాణ మార్చ్‌లె పాల్గొంటానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలియజేశారుజ ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎన్ని ఆటంకాలెదురైనా సెప్టెంబర్‌ 30న తెలంగాణ కవాతులో పాల్గొంటానని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గోనని నేతలను తెలంగాణ ప్రజలు ద్రోహులుగా చూస్తారని హెచ్చరించారు. అరెస్టు చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మార్చ్‌ను శాంతియుతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.