మాలేగావ్‌ బాంబుపేలుళ్ల నిందితురాలు ప్రగ్యాసింగ్‌ వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు..


కబడ్డీ ఎలా ఆడారు..?
` ప్రగ్యాసింగ్‌ అనారోగ్యం అసలురూపం బయటపడిరది
` కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.కె.మిశ్ర ఎద్దేవా
భోపాల్‌,అక్టోబరు 17(జనంసాక్షి):మధ్యప్రదేశ్‌ భాజపా నాయకురాలు, భోపాల్‌ ఎంపీ ప్రగ్యాసింగ్‌ ఠాకుర్‌ కబడ్డీ ఆడుతున్న వీడియో ఒకటి వైరలై వివాదంగా మారింది. మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలైన ఆమె గత కొన్నేళ్లుగా వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యారు. ఈ అనారోగ్య కారణాలను చూపే ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే శుక్రవారం రాత్రి భోపాల్‌లో సింధి వర్గం ఏర్పాటుచేసిన దుర్గా పూజలో పాల్గొన్న ప్రగ్యాసింగ్‌ అక్కడ యువకులతో సరదాగా కబడ్డీ రైడిరగ్‌ చేశారు. ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయింది. ప్రగ్యాసింగ్‌ అనారోగ్యం అసలు రూపం బయటపడిరదని కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.కె.మిశ్ర ఎద్దేవా చేశారు. ఇటీవలే నవరాత్రి ఉత్సవాల్లో ఆమె గార్బా నృత్యం కూడా చేశారని, ఆ వీడియో కూడా ఉందని విమర్శలు గుప్పించారు. కాగా ప్రగ్యాసింగ్‌కు వెన్నెముక సమస్య ఇప్పటికీ అలాగే ఉందని, ఎప్పుడైనా అది తీవ్రంగా మారే అవకాశం ఉందని ఆమె సోదరి ఉప్మా ఠాకుర్‌ చెప్పారు.తన కబడ్డీ వీడియో తీసిన వ్యక్తిని రావణుడితో పోల్చారు ప్రగ్యాసింగ్‌. అతను వృద్ధాప్యంలో, వచ్చే జన్మలో నాశనమైపోతాడని శాపనార్ధాలు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ రావణుడి భావజాలంతో తనపై విమర్శలు చేస్తోందన్నారు.