మావోయిస్టులకు ఆశ్రయం,సహకారం అందించొద్దు
ప్రజల రక్షణ మా బాధ్యత:మహబూబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
కొత్తగూడ సెప్టెంబర్9 జనంసాక్షి:ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించిన మహబూబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మహబూబాబాద్ జిల్లా పరిధి ఏజెన్సీ ప్రాంతాలైన గూడూరు,కొత్తగూడ,గంగారం మండలలలోని మత్వాడ,ఉట్ల,కర్లై గ్రామాలను సందర్శించారు.ప్రజలతో మమేకమై వారితో మాట్లాడుతూ మావోయిస్టులకు ఆశ్రయం,సహకారం అందించవద్దని ఏజెన్సీ ప్రాంత ప్రజలను కోరారు.ఉమ్మడి జిల్లాలలో అలజడి సృష్టించేందుకు మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారని,ఆ ప్రయత్నాన్ని తిప్పి కొట్టాలంటే ప్రజలు,పోలీసులకు సహకరించాలని కోరారు.ఒకప్పటి పాత పద్ధతిలాగా బెదిరించే పరిస్థితి లేదని,ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు.డీజీపీగా మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు పిలిస్తే పలికే విధంగా అందుబాటులో ఉన్నారని అన్నారు.ఏదైనా సంఘటన జరిగిన వెంటనే 100కు ఫోన్ చేసిన 5 నిమిషా లకే పోలీసులు అందుబాటులోకి రావడం జరుగుతుందని అన్నారు.ఒక వేళ ఎక్కడైనా బెదిరించే ప్రయత్నం చేసినా వెంటనే ఉన్నతాధికారులకు తెలుస్తుందని అన్నారు.కాబట్టి ప్రజలు పోలీసుల సేవలు ఉపయోగించుకోవాలని కోరారు.జిల్లా లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తవు లేకుండా చూసుకునే బాధ్యత పోలీసులదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి సదయ్య,గూడూరు సిఐ యాసిన్,గూడూరు ఎస్సై సతీష్,కొత్తగూడ ఎస్సై నగేష్,గంగారం ఎస్సై ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area