మావోయిస్టు కమాండర్‌ సూర్యం లొంగుబాటు

అనారోగ్యమే కారణమని వెల్లడి
విజయనగరం ఎస్పీ ఎదుట సరెండర్‌
విజయనగరంఆగస్టు 15 (జనంసాక్షి) : మల్కన్‌గిరి డివిజన్‌ కమాండర్‌గా, మాచ్‌ఖండ్‌, ఎల్‌ఓఎస్‌ ప్రాంతీయ కమిటీ సభ్యుడిగా పని చేసిన మావోయిస్ట్‌ గోపు సందేష్‌ అవియాస్‌ సూర్యం బుధవారం విజయనగరం ఎస్సీ కార్తికేయ ఎదుట లొంగిపోయాడు. ఈ సందర్భంగా ఎస్సీ విలేకర్ల సమావేశంలో మావోయిస్టుని ప్రవేశ పెట్టారు. ఉద్యమంలో పని చేసిన సమయంలో కొండ మీద నుంచి జారి పడటంతో ఎడమ కాలికి తీవ్ర గాయమైం దని, అప్పటి నుండి తీవ్ర అనారోగ్యం, పోలీస్‌లు నిఘా ఎక్కువ కావడంతో ఉద్యమంలో కొనసాగడం కష్టమౌందన్న కారణాలతో తాను లొంగిపోతున్నట్టు సందేశ్‌ తెలిపారు. ఇతడి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కానుకుల గిడ్డ.బీఎస్సీ ద్వీతీయ సంవత్సరం చదువుతూ తల్లిదండ్రుల స్ఫూర్తితో, మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై 2004లో సీపీఐ(మావోయిస్టు) పార్టీలో చేరాడు. ఒడిశాలోని మల్కన్‌గిరి డివిజన్‌లో మావోయిస్టు పార్టీ సభ్యులు పాల్పడిన పలు పూరాల్లో ఇతడు నిందితుడు. ఇతడి పై ప్రభుత్వం రూ.2 లక్షల రివార్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎస్సీ కార్తికేయ మాట్లాడుతూ ఆజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని, వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ఆసరగా నిలవాలని కోరారు. లొంగి పోయిన మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నారు.