మీ-సేవలో ఓటరుకార్డులు జారీ

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : మీ-సేవ కేంద్రాల ద్వారా ఆగస్టు 1వ తేదీ నుండి ఓటర్‌ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుజాతశర్మ తెలిపారు. ఇదివరకు ఓటర్‌ కార్తింపు కార్డు కలిగి ఉండి దానిని పోగొట్టుకున్న ఓటర్లు తిరిగి డూప్లికేట్‌ కార్డును పొందవచ్చునని అన్నారు. ఇందుకు గాను రూ. 25 చెల్లించి జిల్లాలోని మీ- సేవ కేంద్రాల ద్వారా అప్పటికప్పుడు కార్డును పొందవచ్చునని అన్నారు. అదేవిధంగా కార్డులో ఏమైన తప్పులు దోర్లితే సరి చేసుకోవచ్చునని అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.