*ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలకు రవాణా తిప్పలు*

*బీఎస్పి ప్రెస్ మీట్ లో కలుగూరి వెంకట్*

*పలిమెల, ఆగస్ట్ 29 (జనంసాక్షి)* మండల కేంద్రం లో బీఎద్పి పలిమెల మండల కమిటీ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గ ఇంచార్జ్ కందుగుల రాజన్న ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనిలో భాగంగా మండల కన్వీనర్ కలుగురి వెంకట్ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతమైన పలిమెల మండలానికి రావలసిన బస్ ను కేవలం పక్క జిల్లా పెద్దపల్లి జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారని జిల్లా కేంద్రానికి దాదాపుగా వంద కిలోమీటర్ల దూరం ఉన్న ముకునురుకు వచ్చే ఒకే ఒక్క బస్ సర్వీస్ ను పంపిచక పోవడం చాలా దారుణం అన్నారు. ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పే ప్రభుత్వం కేవలం వాళ్ళ పార్టీ మీటింగులకు ప్రభుత్వ బస్ లను ఉపయోగించుని సాదారణ ప్రజానీకానికి ఇబ్బంది పెట్టడం చాలా గోరం అని దీనిని బీఎస్పి పార్టీ పూర్తిగా ఖండిస్తుంది అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిచో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. ఇలా చాలా సార్లు ఏ మీటింగ్ జరిగినా పలిమెల బస్ ను పంపక పోవడం జరిగింది అని దీనిని ఇక్కడి రాజకీయ నాయకులు పట్టించుకోక పోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో పలిమెల మండలం సెక్టర్ అధ్యక్షుడు తోలేం శ్రీనివాస్, మండల జనరల్ సెక్రటరీ జనగామ రామ్మూర్తి, మండల కో కన్వీనర్ దుర్గం గోపి పాల్గొన్నారు.