ముదిరాజ్ వనసమారాధన విజయవంతం చేయాలి

రఘునాధపాలెం నవంబర్ 19 జనం సాక్షి రఘునాధపాలెం గ్రామంలో ముదిరాజుల ఐక్యవేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో రఘునాధపాలెం మండలం ముదిరాజ్ కుల బాంధవులు మరియు ముదిరాజ్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ముదిరాజ్ సంఘం ఐక్యవేదిక కార్యక్రమంలో భాగంగా ది-20. న ఆదివారం నాడు జరగబోయే ముదిరాజ్ వన సమారాధన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మండలంలో ఉన్నటువంటి ముదిరాజ్ కుటుంబ సభ్యులు మరియు రఘునాధపాలెం గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజ్ కుల బంధువులను పేరుపేరునా ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో దోరేపల్లి శ్వేత ఖమ్మం జిల్లా ముదిరాజ్ యువ ఐక్యత అధ్యక్షురాలు మరియు కుల పెద్దలు పాల్గొనాలని ముదిరాజ్ వనసమరాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు