ముద్దక్క కుటుంబంతో భేటీ అయిన సూకీ
అనంతపురం : మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్‌సాన్ సూకీ పాపసానిపల్లెకు చేరుకున్నారు. అక్కడ డ్వాక్రా మహిళా సంఘం సభ్యురాలు ముద్దక్క కుటుంబసభ్యులతో భేటీ అయ్యారు. పొదుపు సంఘాల ద్వారా జీవితాన్ని చక్కదిద్దుకున్న ముద్దక్క ప్రగతి గురించి ఆడిగి తెలుసుకున్నారు. పోదుపు సంఘాల సమావేశాల నిర్వహణను పరిశీలించారు.



